తొగుట : ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ రైతు మృతి (Farmer suicide) చెందిన ఘటన మండల కేంద్రం తొగుటలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రవికాంతరావు( SI Ravikanth Rao) తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండారు మహేష్ (35) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు.
ఈ నెల 22న విషయంలో ఆర్థిక ఇబ్బందుల విషయమై భార్య భర్తలు గొడవపడ్డారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయి గడ్డి మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ దవఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుని సోదరుడు నాగరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.