నంద్యాల : శ్రీశైలం ( Srisailam ) మల్లికార్జున స్వామి ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా పలు సౌకర్యాలను ( Facilities ) కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ రావు ( EO Srinivasa Rao ) వెల్లడించారు. 79వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆలయ కార్యాలయ భవనం ఎదుట మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది దేశభక్తులు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛ స్వాతంత్య్రాలను నేడు అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
నందికొట్కుర్కు చెందిన సాయిలిక్షిత శ్రీ ప్రదర్శించిన దేశభక్తి గేయాల సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది. శ్రీశైలం ఒకటవ టౌన్లో సీఐ ప్రసాదరావు జెండాను ఎగురవేసి సిబ్బంఇకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, శివసేవకులు, ఎస్పీఎఫ్, హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.