కోటగిరి ఆగస్టు 31 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బోయిగల్లి గంగపుత్ర సంఘం బీఆర్ఎస్, తేల్ల రవికుమార్ యువసేన, బోధన్ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ అధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో పలు వ్యాధులకు సంబంధించి వైద్య నిపుణులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు చక్కెర వ్యాధి, థైరాయిడ్ తో పాటు ఇతరాత్ర ఆరోగ్య సమస్యల పైన వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఉచితంగా మెగా వైద్యం నిర్వహించి వేల రూపాయల విలువ గల మందులను ఉచితంగా పంపిణీ చేయడంతో శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు మోరే కిషన్, తెల్ల రవికుమార్, యువ నాయకుడు మోరే గౌతమ్, సమీర్, చిన్న అరవింద్, అంబటి గంగ ప్రసాద్ గౌడ్, కప్ప సంతోష్,యోగేష్, శంకర్ గౌడ్,నవీన్, రాజు,పాల గంగారాం, అయ్యూబ్. అరుణ్ గౌడ్, హన్మంత్ రావు, సందీప్, నజీర్. మహేష్ రెడ్డి, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.