టీకా డోసుల మధ్య విరామ సమయం పెంపుతో ముప్పే : ఆంథోని ఫౌసీ
టీకా డోసుల మధ్య విరామం సమయం పెంపుతో ముప్పే : ఆంథోని ఫౌసీ | కరోనా టీకాల మధ్య విరామ సమయం పెంచడంతో ప్రస్తుతం ఉన్న కొవిడ్ వేరియంట్ల బారినపడే ప్రమాదం ఉందని అమెరికా మెడికల్ అడ్వైజర్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ అన్నారు.

న్యూఢిల్లీ : కరోనా టీకాల మధ్య విరామ సమయం పెంచడంతో.. ప్రస్తుతం ఉన్న కొవిడ్ వేరియంట్ల బారినపడే ప్రమాదం ఉందని అమెరికా మెడికల్ అడ్వైజర్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ అన్నారు. బ్రిటన్‌లో విరామ సమయం పొడగించడంతో పలు రకాల వేరియంట్ల బారినపడ్డారని, ఈ మేరకు షెడ్యూల్ మేరకు టీకాల పంపిణీ చేపట్టాలని సిఫారసు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, టీకాల సరఫరా తక్కువగా ఉంటే.. కొనసాగించవచ్చన్నారు. దేశంలో కొవీషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రభుత్వం మొదట ఆరు నుంచి 8 వారాలకు.. ఆ తరువాత 12 నుంచి 16 వారాలకు పెంచింది.
అంతకు ముందు మార్చి నెలలో అయితే 28 రోజులు ఉంటే సరిపోతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. మూడు నెలల్లో విరామ కాలాన్ని రెండు సార్లు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో అడిగిన ఓ ప్రశ్నపై ఆయన స్పందించారు. ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. డెల్టా వేరియంట్‌ను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా ప్రజలకు టీకాలు వేయాలన్నారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో డెల్టా వేరియంట్ బలంగా ఉందని గుర్తు చేశారు. టీకాలు వేసిన దేశాల్లో వ్యాప్తి తక్కువగా ఉందన్నారు. కొవిడ్‌తో పోరాడేందుకు టీకాలు కీలకమని, ఎవరైనా ఇంతకు ముందు వైరస్ బారినపడినప్పటికీ టీకాలు వేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వచ్చే కరోనా థర్డ్, మరిన్ని వేవ్‌ల నుంచి ప్రజలను రక్షించడంలో వ్యాక్సిన్ కీలకమని వివరించారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్లో మార్పులు?
లక్షమందితో హెల్త్ఆర్మీ
శ్రీశైలం, మహానందిలో దర్శన వేళల్లో మార్పులు
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
13 మంది నక్సలైట్ల లొంగుబాటు
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్
మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ.. బెయిల్ ఇచ్చేందుకు డొమినికా కోర్టు నిరాకరణ
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ పెరిగిన మరణాలు
వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కరోనా సెకండ్ వేవ్‌లో 719 మంది వైద్యుల మృతి
వచ్చే వారంలో ఆర్మీ ఉన్నతాధికారుల భేటీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

