హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం తెలిపారు. ఈనెల 29న దీక్షా దివస్ను పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు.. 11రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29 నుంచి డిసెంబర్ 9వరకు 11రోజుల పాటు ప్రతీరోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసి, వివరాలను కేటీఆర్కు పంపినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలు, రాష్ట్రంలో రైతుల సమస్యలపై యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టు వివరించారు.
తెలంగాణ పోరాట యోధులకు అవార్డులకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ అభిమానులు 11రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అబ్దుల్ ముకీత్ చందా, వహీద్ అహ్మద్, మాజీ చైర్మన్లు అక్బర్ హుస్సేన్, ఇనాయత్ అలీ బాఖరీ, మహ్మద్ షరీఫుద్దీన్, మీర్ మహమూద్ అలీ, మహ్మద్ నయీముద్దీన్, జహురుద్దీన్ యూసుఫీ, సయ్యద్ ఫహీం, షేక్ మహ్మద్ అజహర్, మాజీ కౌన్సిలర్ మీర్ తాహిర్ అలీ, మహ్మద్ అస్లాం, మహ్మద్ జానీమియా, మహ్మద్ ముజాహిద్ ఖురేషీ, జమాన్ ఖాన్, మహ్మద్ అలీ, మహ్మద్ సైఫుద్దీన్లోది తదితరులు పాల్గొన్నారు.