సిటీ బ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): మహానగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణాఫేజ్-1, 2, 3 పంపింగ్ స్టేషన్లకు విద్యు త్ సరఫరా చేసే బల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. నాసర్లపల్లి, జలమండలి పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్లకు 26న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిలిపేస్తారని చెప్పారు.
బుధవారం కృష్ణా ఫేస్-1, 2, 3ల పరిధిలోని డివిజన్ల ప్రాంతాల్లో నీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఓ అండ్ఎం డివిజన్ నంబర్-12 మినహా ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్-1 నుంచి 20 వరకు కలిగిన చార్మినార్, వినయ్‌నగర్, బోజగుట్ట, రెడ్ హిల్స్, నారాయణగూడ, ఎస్ఆర్ నగర్, మారేడ్‌పల్లి, రియాసత్ నగర్, కూకట్పల్లి, సాహె బ్ నగర్, హయత్‌నగర్, సైనిక్‌పురి, ఉప్పల్, హఫీజ్‌పేట, రాజేంద్రనగర్, మణికొండ, బోడుప్పల్, మీర్‌పేట డివిజనల్లో అంతరాయం కలగనుంది.