హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తుల గడువు ఈ నెల 29తో ముగియనున్నది. ఇప్పటి వరకు 1,26,085 దరఖాస్తులు వచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నవీన్ నికోలస్ తెలిపారు.
పేపర్-1కు 46,954, పేపర్-2కు 79,131 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు.