కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సాకారం.. దీక్షా దీవస్ సందర్భంగా 11 రోజులు కార్యక్రమాలు
తెలంగాణ తొలి ముఖ్యమంతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం తెలిపారు. ఈనెల 29న దీక్షా దివస్‌ను పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు.. 11రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
- మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం తెలిపారు. ఈనెల 29న దీక్షా దివస్‌ను పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు.. 11రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29 నుంచి డిసెంబర్ 9వరకు 11రోజుల పాటు ప్రతీరోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసి, వివరాలను కేటీఆర్‌కు పంపినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలు, రాష్ట్రంలో రైతుల సమస్యలపై యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టు వివరించారు.
తెలంగాణ పోరాట యోధులకు అవార్డులకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ అభిమానులు 11రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అబ్దుల్ ముకీత్ చందా, వహీద్ అహ్మద్, మాజీ చైర్మన్లు అక్బర్ హుస్సేన్, ఇనాయత్ అలీ బాఖరీ, మహ్మద్ షరీఫుద్దీన్, మీర్ మహమూద్ అలీ, మహ్మద్ నయీముద్దీన్, జహురుద్దీన్ యూసుఫీ, సయ్యద్ ఫహీం, షేక్ మహ్మద్ అజహర్, మాజీ కౌన్సిలర్ మీర్ తాహిర్ అలీ, మహ్మద్ అస్లాం, మహ్మద్ జానీమియా, మహ్మద్ ముజాహిద్ ఖురేషీ, జమాన్ ఖాన్, మహ్మద్ అలీ, మహ్మద్ సైఫుద్దీన్లోది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

