హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలని కోరుతూ వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు టీఎస్ యూటీఎఫ్ ప్రకటించింది. మంగళవారం ప్రధానమంత్రికి, ఈ నెలాఖరు వరకు ఎంపీలకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ తెలిపారు.
కేంద్రం తక్షణమే స్పందించి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టం చేయాలని లోక్సభ, రాజ్యసభ సభ్యులను కోరనున్నట్టు వెల్లడించారు.