Bajireddy Govardhan | నిజామాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అనుకూలంగా కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కవిత పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి మాట్లాడటంతో పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు.
కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన కవిత పక్క పార్టీలకు సపోర్ట్ చేసినట్లు మాట్లాడుతోంది. పార్టీ బాగు కోసం కూతురైనా… కొడుకైనా చర్యలకు కేసీఆర్ వెనుకాడరు. హరీష్ రావు, సంతోష్ రావు బిఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు అని బాజిరెడ్డి పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి రాష్ట్రనికి పట్టిన శని. 22 నెలల కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేర్చలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ కూడా సిబిఐకి అప్పగించాలనడం కుట్రనే అని బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు.