టాలీవుడ్ (Tollywood) హీరోయిన్లు రెజీనా కసాండ్రా(Regina), నివేదా(Nivetha Thomas) లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం శాకిని డాకిని (Saakini Daakini). సుధీర్ వర్మ(Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్నారు. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సునీతా తాటి, హీరోయిన్లతో కలిసి తెలుగు మీడియాతో చిట్ చాట్ చేశారు.
తాను శాకిని డాకినీ చిత్రాన్ని సురేశ్ బాబు ఆశీస్సులతో నిర్మించానన్నారు సునీతా తాటి (Sunitha Tati). కథ, లీడ్ రోల్స్, స్ఫూర్తి..ఈ మూడు అంశాలు సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయన్నారు. ఓ క్రైమ్ను ఎదుర్కొనే ఇద్దరు యువ ట్రైనీ పోలీసుల కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అన్నారు. సినిమా వినోదాన్ని అందించడమే..సినిమా చూసిన తర్వాత కూతురున్న ప్రతీ ఒక్కరూ గర్వపడేలా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ , గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ , టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. కొరియన్ చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ కెమెరా వర్క్ చేస్తున్నాడు. మిక్కీ ఎంసీ క్లియరీ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also : Ahimsa | ‘అహింస’ షూటింగ్ పూర్తి..రిలీజ్ డేట్ చెప్పనున్న తేజ టీం..!
Read Also : Bigg Boss 6 Telugu | గీతూ, ఇనయా సుల్తానా మధ్య వార్..మొదటి టాస్క్ ఇదే..!