Bigg Boss 6 Telugu | గీతూ, ఇనయా సుల్తానా మధ్య వార్..మొదటి టాస్క్ ఇదే..!
గొడవలు లేకుండా బిగ్ బాస్ షోను ఊహించడం కష్టమే. అంతా అనుకున్నట్టుగానే గీతూ రాయల్ (Geetu royal), ఇనయా సుల్తానా మధ్య వార్ జరిగింది. ఇద్దరూ నీకు తిక్కంటే నీకు తిక్క అంటూ తిట్ల దండకం పెట్టుకున్నారు.
సభ్యుల డ్యాన్స్ తో బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu 6) సందడిగా మొదలైన విషయం తెలిసిందే. అయితే గొడవలు లేకుండా బిగ్ బాస్ షోను ఊహించడం కష్టమే. అంతా అనుకున్నట్టుగానే గీతూ రాయల్ (Geetu royal), ఇనయా సుల్తానా మధ్య మొదటి వార్ జరిగింది. ఈ వార్ సీరియస్‌గా, ఫన్‌గా సాగుతూ అందరిలో నవ్వులు పూయించింది.
బాత్రూంలో స్నానం చేసిన వాళ్లు..అక్కడ పడి ఉన్న హెయిర్‌ను తీసేయాలని గీతూ అంటే..ఆ విషయం ప్రత్యేకంగా నాతోనే ఎందుకు చెప్తున్నావంటూ ఇనయ సుల్తానా (inaya sultana)ఆమెతో గొడవకు దిగింది. ఇద్దరూ నీకు తిక్కంటే నీకు తిక్క అంటూ తిట్ల దండకం పెట్టుకున్నారు. ఈ క్రమంలో గీతూ రాయల్ ఇనయా సుల్తానాతో ఆడుకుంది. ఇప్పటికే విడుదలైన ఈ ప్రోమో నెట్టింట వైరల్ అయింది.
హౌస్ మేట్స్ ను క్లాస్, మాస్, ట్రాష్ అనే మూడు తరగతులుగా విభజించిన విషయం తెలిసిందే. మొదటి రోజు ఒక తరగతిలో ఉన్న హౌస్ మేట్స్ రెండో ఇంకో తరగతికి మారిపోయారు. మొదట ట్రాష్‌లో ఉన్న గీతూరాయల్ రెండో రోజు క్లాస్‌లోకి వచ్చింది. ట్రాష్ టీమ్‌లో ఉన్న ఇనయాకు చుక్కలు చూపించింది. టాస్క్‌లో భాగంగా ఇనయా సుల్తానా గీతూ రాయల్ ఏం పని చెప్తే అది చేయాలి. ఇనయాతో బాటిల్ తెప్పించుకోవడం, నిమ్మరసం చేయించుకోవడం, దువ్వెనను తెప్పించుకోవడం లాంటి పనులు చేయించుకుంది. దీంతోపాటు పాట పాడాలని ఇనయా సుల్తానాను ఆదేశించింది. నేను పని చెప్తే చేస్తా..కానీ నీ కోసం పాటలు, పద్యాలు పాడను అంటూ గీతూ ముఖం మీదే చెప్పేసింది ఇనయా .

మొదటి టాస్క్ ఏంటంటే..?
మూడు తరగతులు క్లాస్, ట్రాష్, మాస్..వీటిలో క్లాస్ అంటే..ఇందులో ఉండేవారికి అపరిమితమైన అధికారాలుంటాయి. వాళ్లు హౌస్మేట్స్ తో ఏ పని కావాలంటే అది చేయించుకోవచ్చు. వాళ్లు వీఐపీ బాల్కనీని వాడుకోవచ్చు. కెప్టెన్నీ పోటీదారులయ్యే ఛాన్స్ కూడా వీరికుంటుంది. ఇక ట్రాష్..అంటే ఇందులో ఉండే హౌస్మేట్స్ కేవలం గార్డెన్ ప్రాంతంలోనే వంకుకుని తినాలి. కెప్టెన్సీకి పోటీపడే అర్హత ఉండదు. వీరు నేరుగా నామినేట్ అవుతారు.
ఇక మాస్ అంటే..వీరికెలాంటి అధికారాలుండవు. ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలేమి ఉండవు. నామినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఫైనల్‌గా ఎవరు క్లాస్, మాస్, ట్రాష్ కేటగిరీల్లో ఉంటారు..మొదటి వారం ఎవరు నామినేట్ అవుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. రానున్న ఎపిసోడ్స్ లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.
"Mimmalni Geetu rammantundhi…"🤭
Fun-o-funnu! Day 2 episode asalu miss avvakandi on @StarMaa, Streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/E3fniq7Xqn
— Starmaa (@StarMaa) September 6, 2022
Read Also : “Bigg Boss 6 First Task Promo | ఫస్ట్ టాస్క్..కొబ్బరి బోండాల యుద్దంలో ఎవరు గెలిచారు..ప్రోమో”
Read Also : Manchu Manoj | రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

