మరికల్, జూన్ 29: మరికల్ మండలంలోని చిత్తనూర్ ఆగ్రో ఇండస్ట్రీస్, ఆగ్రో ఫార్మ్స్ అధినేత మోహన్ రావు జ్ఞాపకార్థం ఆదివారం మరికల్ మండలం చిత్తనూర్ జూరాల ఇథనాల్ కంపెనీ ఆవరణలో పదివేల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకై పదివేల మొక్కలు నాటామన్నారు. మోహన్ రావు జ్ఞాపకార్థం మొక్కలను నాటడంతోపాటు వాటిని సంరక్షిస్తామని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణలో తమ వంతు కృషిగా మొక్కలను పెంచుతున్నామని తెలిపారు. మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జూరాల ఇత్తనాలు కంపెనీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.