‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని, పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐద్వా నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. బుధవారం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో...
– పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలి
– ఐద్వా నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి
రామగిరి, అక్టోబర్ 14 : రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని, పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐద్వా నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. బుధవారం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో డీఆర్ఓ దశరథకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. వంట గ్యాస్ ధరల పెరుగుదల మహిళలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి రేషన్ షాపుల ద్వారా పప్పులు, వంటనూనె, చక్కెరతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులను అందించాలని కోరారు.
అర్హులైన పేద కుటుంబాలన్నింటికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేయడంతో పాటు జనాభాకు అనుగుణంగా కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు, బాలికలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పౌష్టికాహార పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. నిత్యావసర వస్తువుల అధిక ధరలు, అక్రమ నిల్వలు, ఆహార కల్తీని అరికట్టేందుకు అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆహార భద్రతను కాపాడటంతో పాటు నిత్యావసర ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభావతి కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు కొండ అనురాధ, పాతూరి గోవర్ధన, చనబోయిన నాగమణి, కౌసల్య, వెంకటమ్మ, సుల్తానా, సాయిదమ్మ, ఉమా పాల్గొన్నారు.

‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

