Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
దసరా సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చి స్నేహితులతో ఆటలాడుకుంటూ ఆనందంగా గడపాల్సిన బాలుడిని నీటి గుంత మృత్యువు రూపంలో కబళించింది.
కురవి, అక్టోబర్ 14 : దసరా సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చి స్నేహితులతో ఆటలాడుకుంటూ ఆనందంగా గడపాల్సిన బాలుడిని నీటి గుంత మృత్యువు రూపంలో కబళించింది. అప్పటికే తొలి సంతానమైన కుమార్తెను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు.. ఇప్పుడు ఒక్కగావొక్క కుమారుడు సైతం దూరమయ్యాడు. కుటుంబంలో తీరని విషాదాన్ని నింపిన ఈ హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారు కాకులబోడు తండాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మరిపెడ మున్సిపాలిటీ ఐదో వార్డుకు చెందిన బోడ హరీష్- అరుణ దంపతుల కుమారుడు అక్షిత్ (9) స్థానిక కేరళ గ్లోబల్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు.
దసరా సెలవులు రావడంతో కురవి మండలం నేరడ శివారు కాకులబోడు తండాలోని అమ్మమ్మ, తాత బానోత్ సరోజ మల్సూర్ ఇంటికి వచ్చాడు. తండా సమీపంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న నీటి గుంతల వద్దకు వెళ్లిన అక్షిత్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గుంతలో బాలుడు పడిపోయిన విషయాన్ని అతడితో పాటు వెళ్లిన పిల్లలు చెప్పడంతో మేనమామ నరేశ్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే బాలుడు మృతి చెందడంతో తండావాసులు గుంతలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు.
సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తండాకు చేరుకుని కుమారుడి మృతదేహాన్ని మరిపెడకు తీసుకెళ్లారు. సెలవుల్లో సరదాగా గడిపేందుకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన మనుమడు విగతజీవిగా మారడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. హరీష్ అరుణ దంపతులకు మొదట కుమార్తె జన్మించగా, ఆమెను ఇప్పటికే కోల్పోయారు. ఇప్పుడు రెండో సంతానమైన కుమారుడు అక్షిత్ సైతం మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. ఇద్దరు సంతానాన్ని కోల్పోయిన ఆ దంపతుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

