– కొత్తగూడెం ఏరియా జీఎం సిహెచ్. వెంకటరమణ
– ఉద్యోగులకు మట్టి విగ్రహాలు పంపిణీ
రుద్రంపూర్, సెప్టెంబర్ 12 : పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శనివారం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా జీఎం సిహెచ్. వెంకటరమణ హాజరై ఉద్యోగులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా జీఎం వెంకటరమణ మాట్లాడుతూ ఉద్యోగులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అన్నారు. పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉద్యోగులకు ఈ విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ మట్టి విగ్రహాలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ జే. గట్టయ్య, ఐఎన్టీయూసీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎండీ. రజాక్, ఎస్ఓ టు జీఎం ఎం. గోవిందరావు, ఇతర విభాగాల అధిపతులు, అధికారులు, జీఎం కార్యాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.