‘మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ’
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శనివారం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా జీఎం సిహెచ్. వెంకటరమణ హాజరై ఉద్యోగులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.
– కొత్తగూడెం ఏరియా జీఎం సిహెచ్. వెంకటరమణ
– ఉద్యోగులకు మట్టి విగ్రహాలు పంపిణీ
రుద్రంపూర్, సెప్టెంబర్ 12 : పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శనివారం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా జీఎం సిహెచ్. వెంకటరమణ హాజరై ఉద్యోగులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా జీఎం వెంకటరమణ మాట్లాడుతూ ఉద్యోగులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అన్నారు. పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉద్యోగులకు ఈ విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ మట్టి విగ్రహాలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ జే. గట్టయ్య, ఐఎన్టీయూసీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎండీ. రజాక్, ఎస్ఓ టు జీఎం ఎం. గోవిందరావు, ఇతర విభాగాల అధిపతులు, అధికారులు, జీఎం కార్యాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

