BRICS Leaders | పహల్గాం దాడిని ఖండిస్తున్నాం.. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించం..!
BRICS Leaders : ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించమని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించమని బ్రిక్స్(BRICS) దేశాధినేతలు స్పష్టం చేశారు. న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌లో ఏకతాటిపైకి వచ్చిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఈ ప్రకటన చేశారు.
BRICS Leaders : ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించమని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించమని బ్రిక్స్ దేశాధినేతలు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించిన వీరు.. అన్ని రకాల ఉగ్రవాద చర్యలను క్రిమినల్, సహేతుకంకాని నేరంగా పరిగణించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రకటన చేశారు.
భారత్ వేదికగా జరుగుతున్న పద్దెనిమిదో బ్రిక్స్ సమావేశంలో ఉగ్రవాదంపై పిడికిలి బిగించారు నేతలు. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిక్స్ నాయకులు.. అన్ని రకాల టెర్రరిజంపై పోరాటానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. 140 పాయింట్లతో న్యూ ఢిల్లీ డిక్లరేషన్ విడుదల చేసిన వీరు.. ఉగ్రవాదాన్ని క్రిమినల్, న్యాయసమ్మతం కాని చర్యగా పరిగణించాలని తీర్మానించారు.
🚨 DELHI DECLARATION
BRICS calls for zero tolerance on terrorism, rejects double standards, and backs action against terrorists in all forms, including cross-border terrorism – a clear message to Pakistan
BRICS condemns last year’s Pahalgam terror attack.
BRICS calls for… pic.twitter.com/Ds6ZsqtLb1
— News Algebra (@NewsAlgebraIND) September 12, 2026
‘జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిని మేము ఖండిస్తున్నాం. ఈ ఘటనలో 26 మంది చనిపోగా.. చాలామంది గాయపడ్డారు. ఇలాంటి దుశ్చర్యలపై, సీమాతంర ఉగ్రవాదంపై, టెర్రరిస్టులకు ఆర్ధిక సాయం చేస్తున్నవారిపై, ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. టెర్రరిజంపై ఎవరూ ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు’ అని బ్రిక్స్ నాయకులు ఓ ప్రకటన విడుదల చేశారు.
PTI INFOGRAPHICS | Key highlights from the BRICS New Delhi Declaration 2026 (n/5)#BRICSUpdatesOnPTI #BRICS2026 #BRICS #BRICSSummit #BRICSIndia #PTIInfographics pic.twitter.com/FFKUna8QrC
— Press Trust of India (@PTI_News) September 12, 2026
న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ప్రకారం.. తీవ్రవాదం, తీవ్రవాద భావజాలాన్ని అణచివేయడం.. ముఖ్యంగా యువత అటువైపు ఆకర్షితలవ్వకుండా చూడడం చాలా ముఖ్యం. ఈ విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత మెరుగవ్వాల్సిన అవసరముంది. అంతేకాదు తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు ఉత్తమ విధానాలను పంచుకోవాల్సి ఉంది అని తీర్మానంలో బ్రిక్స్ నేతలు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

