College Bus | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
కేఎల్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు మణుగూరు నుంచి పాల్వంచకు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కాగా, గాయపడిన విద్యార్థులను భద్రాచలంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.