Donald Trump | తాను ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి చాటింపు వేసుకున్నారు. ఇందుకు టారిఫ్‌లే కారణమని పేర్కొన్నారు. ఆంగ్లభాషలో ‘టారిఫ్’ (tariffs) అనే పదం తనకు చాలా ఇష్టమైన పదం అని ట్రంప్ పునరుద్ఘాటించారు.
‘పది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపాను (Ended 8 wars in 10 months). ఇరాన్ అణు ముప్పును నాశనం చేశాను. గాజాలో యుద్ధాన్ని ఆపి.. మూడు వేల సంవత్సరాల్లో పశ్చిమాసియాలో తొలిసారి శాంతిని నెలకొల్పా. ఎంతోమంది బందీలను విడుదల చేయించాను’ అని ట్రంప్ తెలిపారు. అదేవిధంగా సుంకాల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. అమెరికాలో 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించగలిగామని ఈ సందర్భంగా తెలిపారు. ఇదంతా సుంకాల కారణంగానే సాధ్యమైందన్నారు.
ఈ సందర్భంగా అమెరికాకు చెందిన ప్రతి సైనికుడికి ట్రంప్ 1,776 డాలర్ల నగదు బహుమతి ప్రకటించారు. 1.45 మిలియన్లకు పైగా సైనికులు క్రిస్మస్ కానుగా ఒక్కొక్కరు 1,776 డాలర్ల నగదు అందుకుంటారని తెలిపారు. ఇది వారి సేవ, త్యాగానికి గుర్తింపుగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సుంకాల కారణంగా ఎవరూ ఊహించనంత డబ్బు సంపాదించినట్లు చెప్పారు. ఇందుకు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు సాయపడిందని ట్రంప్ వివరించారు.
Also Read..
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Ram Suthar | 125 అండుగుల అంబేద్కర్ విగ్రహ రూపకర్త రామ్ సుతార్ కన్నుమూత
Fire Breaks | ఎల్ఐసీ భవనంలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం