హైదరాబాద్: ఛత్తీస్గఢ్ సక్మా జిల్లాలో మావోయిస్టులు (Maoists), భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో (Gollaplli Forest) మావోయిస్టుల కోసం స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని అధికారులు వెళ్లడించారు.