Mrunal Takhur | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కబోయే భారీ చిత్రంపై బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు సిస్టర్ రోల్లో నటించబోతున్నారట.
ఈ పాత్ర కథలో చాలా కీలకమైనదిగా, బలమైన ఎమోషనల్ టోన్‌తో సాగుతుందని టాక్. అన్న-చెల్లెల మధ్య బంధం, భావోద్వేగాలను అట్లీ తన మార్క్ స్టైల్లో చూపించబోతున్నాడని, ఈ పాత్ర ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుందని అంటున్నారు. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. నిజంగా మృణాల్ సిస్టర్ రోల్లో కనిపిస్తారా? లేక మరో షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో వస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో హైలైట్ ఏమిటంటే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె ఇందులో మెయిన్ హీరోయిన్గా నటించనుండగా, జాన్వీ కపూర్ మరో కీలక హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. ఒకే సినిమాలో ఇంతమంది స్టార్ హీరోయిన్లు ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్రేజ్ పెరుగుతోంది.
కథ విషయానికి వస్తే.. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ డాన్ చుట్టూ తిరిగే పవర్ఫుల్ కథను అట్లీ సిద్ధం చేశాడట. యాక్షన్, ఎమోషన్, డ్రామా అన్నీ సమపాళ్లలో ఉండేలా స్క్రిప్ట్‌ను రూపొందించినట్టు సమాచారం. అల్లు అర్జున్ను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా, ఒక కొత్త షేడ్స్ ఉన్న పాత్రలో చూపించేందుకు అట్లీ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా, హాలీవుడ్ రేంజ్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, ఈ సినిమాలో కొన్ని ప్రత్యేక గెస్ట్ రోల్స్ కూడా ఉండబోతున్నాయని టాక్. వాటి కోసం అట్లీ పలువురు స్టార్ నటులను సంప్రదించనున్నారని సమాచారం. ఆ గెస్ట్ రోల్స్‌లో ఎవరు కనిపిస్తారన్నది మరో ఆసక్తికర అంశంగా మారింది.