Encounter | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్ (Bijapur) అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ (Encounter)లో ఐదుగురు మావోలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ సిబ్బంది బుధవారం ఉదయం బస్తర్ డివిజన్ (Bastar division)లోని అటవీ ప్రాంతంలో నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. అక్కడ మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనాస్థలి వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
Also Read..
Sanchar Saathi | ప్రీఇన్‌స్టాలేషన్ తప్పనిసరికాదు.. సంచార్ సాథీపై వెనక్కి తగ్గిన కేంద్రం
PM Modi | పశ్చిమబెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. బీజేపీ ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు
Airports | ఎయిర్‌పోర్టుల్లో సాంకేతిక సమస్య.. ప్రయాణికుల అవస్థలు