Akhanda 2 | టాలీవుడ్లో హిట్ కాంబినేషన్ అంటే వెంటనే గుర్తొచ్చేది బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu). ఈ ఇద్దరూ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు సీక్వెల్ ప్రాజెక్ట్ అఖండ 2 (Akhanda 2)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే. టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే ప్రమోషనల్ టూర్లో బిజీగా ఉన్నారు.
సినిమా విడుదల నేపథ్యంలో బోయపాటి శ్రీను ఎక్స్ ద్వారా తన అభిప్రాయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో బోయపాటి శీను చిన్న కుమారుడు వర్షిత్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను అఖండ 2లో ఒక పాత్రలో నటిస్తున్నానని వర్షిత్ చెప్పినప్పటికీ.. ఆ వివరాలేంటనేది మాత్రం చెప్పలేదు. అయితే వర్షిత్ తండ్రి బోయపాటి మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు.
వర్షిత్ అఖండ 2లో భక్త ప్రహ్లాదుడిగా కనిపించబోతున్నాడని చెప్పాడు. ట్రైలర్‌ను సరిగ్గా గమనిస్తే ప్రహ్లాదుడి గెటప్‌లో ఉన్న కిడ్‌ను చూడొచ్చు. మరి బోయపాటి అఖండ 2లో భక్త ప్రహ్లాదుడి పాత్రను ఎలా డిజైన్ చేశాడు.. కథకీ భక్త ప్రహ్లాదుడిగా ఎలాంటి లింక్ ఉంటుందని మాత్రం సస్పెన్స్‌లో పెట్టాడు. ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. హర్షాలి మల్హోత్రా, పూర్ణ, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే లాంచ్ చేసిన అఖండ 2 టీజర్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఫస్ట్ పార్టుకు మించిన స్కోర్ సీక్వెల్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి. అఖండ 2 చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Rana | దీపికా పదుకొణే వ్యాఖ్యల దుమారం… హాట్ టాపిక్‌గా రానా-దుల్కర్ రియాక్షన్స్
Imdb Most Popular Indian Stars of 2025 | ఐఎండీబీ.. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ తారలు వీరే.!
Samantha- Raj | సమంత-రాజ్ వివాహానికి వచ్చిన అతిథులకి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్స్ ఏంటో తెలుసా?