Samantha- Raj | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తొలుత నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్ నాలుగేళ్ల తర్వాత అతనికి విడాకులు ఇచ్చింది. ఇక ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడిపింది. వారి ప్రేమకి సంబంధించి నెట్టింట అనేక వార్తలు వచ్చిన ఏనాడు దానిపై స్పందించలేదు. అయితే డిసెంబర్ 1న తాము వివాహం చేసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేసి పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫొటోలు నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
సమంత-రాజ్ వివాహం కోయంబత్తూరులోని సద్గురు ఇషా ఆశ్రమంలో జరిగింది. ఈ పెళ్లి పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో, ఇరు కుటుంబాలు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరిగింది. ఈ పెళ్లి ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతున్నాయి. అయితే సమంత – రాజ్ తమ పెళ్లికి విచ్చేసిన అతిథులకు స్పెషల్ రిటర్న్ గిఫ్ట్ ప్యాక్‌లు అందించారు. ఈ గిఫ్ట్ హాంపర్‌లో ప్రత్యేకమైన వస్తువులు ఉన్నట్టు సమాచారం. గిఫ్ట్ ప్యాక్‌లో సద్గురు సందేశం ఉన్న స్పెషల్ కార్డు, ఇషా ఆశ్రమంలో వాడిన పూలతో తయారుచేసిన అగరుబత్తుల ప్యాక్, ఒక చాక్లెట్ బార్ అలానే సమంతకు చెందిన “సీక్రెట్ అల్కెమిస్ట్” బ్రాండ్ పెర్ఫ్యూమ్ బాటిల్ ఉన్నాయట.
ఈ గిఫ్ట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రత్యేకంగా ఇషా ఆశ్రమ పూలతో తయారైన అగరుబత్తులు, సద్గురు సందేశ కార్డు ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పటికే వెలువడిన పెళ్లి ఫోటోలు, సమంత – రాజ్ నిడిమోరు కొత్త జీవితాన్ని ప్రారంభించిన అందమైన క్షణాలు అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పెళ్లి తర్వాత అత్తింటి కుటుంబ సభ్యులతో దిగిన ఫ్యామిలీ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.ఏది ఏమైన సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైన ఈ వేడుక ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.