నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
దేశ అత్యున్నత స్థాయి పదవులో ఉన్న వ్యక్తి చట్ట సభల్లో ఆమోదం పొందిన రాష్ట్ర పునర్విభజన బిల్లుపై నోరు పారేసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు.
ఎన్నో ఏండ్లుగా పోరాడి, వందల మంది ఆత్మబలిదానాలతో తెలంగాణను సాధించుకున్నామన్నారు. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ మలి దశ ఉద్యమం కొనసాగిందని, తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడటంతోనే తెలంగాణ ఇచ్చారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై వ్యతిరేక భావంతో ఉన్న ప్రధాని మోదీ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.