అమరావతి : ఏపీలో ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఏపీ హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. కొత్త పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తుండడం పట్ల ఆమె స్పందించారు. ఈరోజు పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలో విజయవాడకు బయలు దేరిన వారిని హౌస్ అరెస్టులు చేయలేదని, అనుమతి లేని సభకు వెళ్లొద్దని చెప్పామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించాలని సీఎం జగన్ కోరారని గుర్తుచేశారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కరోనాతో రాష్ట్రంలో ఆర్థికపరిస్థితుల ఇబ్బందులున్నాయని ఆమె అన్నారు.