వాషింగ్టన్, అక్టోబర్ 28: ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత ఎన్సైక్లోపీడియాగా తీసుకొచ్చిన ‘గ్రోకీపీడియా’ వెబ్‌సైట్‌ను అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఆయనకు చెందిన ‘ఎక్స్ఏఐ’ కంపెనీ ద్వారా వికీపీడియాకు పోటీగా ‘గ్రోకీపీడియా’ను రూపొందించారు. ‘నిజాయతీ, పక్షపాతం లేని ఆప్షన్’గా గ్రోకీపీడియాను మస్క్ పేర్కొన్నారు.
సత్యాన్వేషణలో జ్ఞాన స్థావరంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రోకీపీడియాలోని ఏఐ చాట్‌బాట్, రియల్ టైమ్ డాటాపై ఆధారపడి పనిచేస్తుందని తెలిపారు. ఇందులోని ఇంటర్ఫేస్ చాలా సింపుల్‌గా ఉంది. హోమ్‌పేజీలో ‘గ్రోకీపీడియా వీ 0.1’ అనే సెర్చ్ బార్ కనిపించింది.