ఇస్లామాబాద్: ఇజ్రాయెల్-పాకిస్థాన్ సంబంధాల్లో అనూహ్య మార్పు రాబోతున్నట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. శాంతి స్థాపన కోసం గాజాస్ట్రిప్కు పాకిస్థాన్ 20వేల మంది సైనికులను అక్కడికి పంపబోతున్నదట. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్, అమెరికా నిఘా ఏజెన్సీలు మొస్సాద్, సీఐఏలతో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ రహస్య ఒప్పందం చేసుకున్నట్టు ‘సీఎన్ఎన్-న్యూస్ 18’ వార్తా కథనం పేర్కొన్నది.
ఇంతకుముందు ఎన్నడూ లేనట్టుగా ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఆపరేషన్లో పాకిస్థాన్ భాగస్వామ్యం కాబోతున్నదని వార్తా కథనం పేర్కొన్నది. ఇజ్రాయెల్ దేశాన్నే అధికారికంగా గుర్తించని పాకిస్థాన్, అంతర్జాతీయ దళానికి తన వంతుగా వేలాది మంది సైనికులను పంపటం గమనార్హం.