హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వాహనాన్ని ఎన్నికల సిబ్బంది, పోలీస్ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. సిరిసిల్ల(Siricilla) పట్టణానికి పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ వాహనాన్నీ ఆపి తనిఖీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులకి కేటీఆర్ పూర్తిగా సహకరించారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
ఎన్నికల నిబంధనలకు కట్టుబడి, అధికారులకు సహకరించిన కేటీఆర్ pic.twitter.com/Yz2nhtt8wQ
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2026