సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో ఓ వృధ్ధురాలిపై హింసకు పాల్పడిన ఆరోపణలను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలికి దయ్యం పట్టిందని అనుమానించిన కుటుంబసభ్యులు ఆమెను ఊరికి దూరంగా తీసుకెళ్లి చెట్టు ఎక్కించి కొరడాలతో కొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది.