ఈ మధ్యకాలంలో చాలామంది ‘సప్లిమెంట్లు’ తీసుకుంటున్నారు. ఆహారంతో శరీరానికి తగినన్ని పోషకాలు అందక.. మాత్రలను ఆశ్రయిస్తున్నారు. అయితే, మహిళల వయసును బట్టి.. పోషకాల అవసరాలు వేరు వేరుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. టీనేజర్లతో పోలిస్తే.. మెనోపాజ్‌కు చేరిన మహిళల శరీర తత్వం వేరుగా ఉంటుందని అంటున్నారు. కాబట్టి, సప్లిమెంట్లు కూడా సపరేటుగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.