కామేపల్లి, ఆగస్టు 24 : తమ్ముడిపై ఆయన సొంత అన్నతో పాటు కుటుంబ సభ్యులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం కామేపల్లి మండలం నెమలిపురిలో చోటుచేసుకుంది. నెమలిపురికి చెందిన సపావట్ రవి అతడి అన్న ఇస్రాకు సంబంధించిన చేనులో దారి వివాదం ఉంది. గతంలోనూ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగి ఇరువురి మధ్య రాజీ కుదిరింది. ఇస్రా మళ్లీ దారిని దున్నడంతో రవి ప్రశ్నించాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టి తీసుకువెళ్లగా వారు ఇస్రాను మందలించారు. ఈ క్రమంలోనే ఇస్రా తన కుటుంబ సభ్యులైన గుణశేఖర్, పూజిత, లచ్చు కత్తులు, గొడ్డలి, ఇనుపరాడ్డు, కర్రలతో ముకుమ్మడిగా రవి అతడి భార్య శైలజపై దాడికి దిగారు. ఈ దాడిలో రవి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన రవి, అతని భార్య శైలజను ఆస్పత్రికి తరలించారు. తనపై జరిగిన హత్యాయత్నంపై చేసిన వారిపై ఫిర్యాదు చేసి చేసినట్లు బాధితుడు తెలిపాడు.