నిడమనూరు, ఆగస్టు 24 : బిజెపి కిసాన్ మోర్చా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నిడమనూరు మండలంలోని రాజన్నగూడెం కు చెందిన సీనియర్ నాయకుడు ఎదుళ్ల వినీల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వినీల్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కిసాన్ మోర్చా బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తానన్నారు. కిసాన్ మోర్చా బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.