తమ్ముడిపై అన్న హత్యాయత్నం
తమ్ముడిపై ఆయన సొంత అన్నతో పాటు కుటుంబ సభ్యులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం కామేపల్లి మండలం నెమలిపురిలో చోటుచేసుకుంది. నెమలిపురికి చెందిన సపావట్ రవి అతడి అన్న ఇస్రాకు సంబంధించిన చేనులో...
కామేపల్లి, ఆగస్టు 24 : తమ్ముడిపై ఆయన సొంత అన్నతో పాటు కుటుంబ సభ్యులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం కామేపల్లి మండలం నెమలిపురిలో చోటుచేసుకుంది. నెమలిపురికి చెందిన సపావట్ రవి అతడి అన్న ఇస్రాకు సంబంధించిన చేనులో దారి వివాదం ఉంది. గతంలోనూ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగి ఇరువురి మధ్య రాజీ కుదిరింది. ఇస్రా మళ్లీ దారిని దున్నడంతో రవి ప్రశ్నించాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టి తీసుకువెళ్లగా వారు ఇస్రాను మందలించారు. ఈ క్రమంలోనే ఇస్రా తన కుటుంబ సభ్యులైన గుణశేఖర్, పూజిత, లచ్చు కత్తులు, గొడ్డలి, ఇనుపరాడ్డు, కర్రలతో ముకుమ్మడిగా రవి అతడి భార్య శైలజపై దాడికి దిగారు. ఈ దాడిలో రవి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన రవి, అతని భార్య శైలజను ఆస్పత్రికి తరలించారు. తనపై జరిగిన హత్యాయత్నంపై చేసిన వారిపై ఫిర్యాదు చేసి చేసినట్లు బాధితుడు తెలిపాడు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- Kamepalli
- khammam news
- murder
RELATED ARTICLES
తాజా వార్తలు
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

