అమరావతి : ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బొలెరో, లారీ ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషాదకర సంఘటన కర్నూలు(Kurnool) జిల్లాలోని మంత్రాలయం మండలం చిలకడోన వద్ద జరిగింది. మృతులు కర్నాటకలోని చిక్మంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు.
కర్నాటక నుంచి మంత్రాలయం దైవ దర్శనానికి వస్తుండగా ప్రమాదం జరగింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచరమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్ట్ నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ బాలిక ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.