చిగురుమామిడి లో వేడుకల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు
CHIGURUMAMIDI | చిగురుమామిడి, మార్చి 31: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ పర్వదినాన్ని ముస్లిం సోదరులు మండలంలో ఘనంగా జరుపుకున్నారు.పలు గ్రామాల్లోని ఈద్గాలలో ఈద్ నమాజ్ ను ఆచరించారు.
మండలంలోని ఇందుర్తి, రేకొండ, ఉల్లంపల్లి, కొండాపూర్, చిగురుమామిడి, ముదిమాణిక్యం బొమ్మనపల్లి తదితర గ్రామాల్లో ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ పండుగ జరుపుకున్నారు. గత 29 రోజులుగా పవిత్రమైన ఉపవాస దీక్షలు పాటించి నేడు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్ ముబారక్ అంటూ ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మజీద్ కమిటీలు, పలు పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.