నందికొండ : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా నల్లగొండ జిల్లా నందికొండ హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోలుస్తూ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయనపై నిరసనలు వెల్లువెత్తాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉనికిని, అమరవీరుల త్యాగాలను అవమానించారని, వేలమంది బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అగౌరవపరిచేలా మాట్లాడటం తేజస్వి సూర్య అజ్ఞానానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కౌన్సిలర్ హీరేకర్ రమేష్ జి, నందికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ముఖ్య సలహాదారుడు ఆదాసు విక్రం,1వ వార్డు ఇంచార్జ్ పమ్మి జనార్దన్ రెడ్డి, 2 వ వార్డు ఇంచార్జ్ మహమ్మద్ గని, 4వ వార్డు ఇంచార్జ్ విజయ్,6 వా వార్డ్ ఇంచార్జ్ చంద్రమౌళి నాయక్, 10 వ వార్డ్ ఇంచార్జ్ కోడా విజయ్, అర్జున్ నాయక్, లక్ష్మణ్ నాయక్, శేఖరా చారి, మన్సూర్, రవి, నజీర్, భూయాకర్ శివ, పిట్ట సైదులు , దార రవి, తదితరులు పాల్గొన్నారు.