ఎల్శిపోయి మూలకువడ్డ తెలంగాణకు
‘గులాబీ’ రంగులద్దిండు…!!
నోరెండుకవోయి అర్రులు చాసిన బీడు భూముల్లో
కాళేశ్వర ‘నీళ్ళు’ పారించి దూపతీర్శిండు… !!
రైతు బంధుతో ‘పచ్చని’ పొలాలు
ఇప్పుడు పురుడువోసుకుంటున్నయి..
గల్మగల్మకు ‘నీలి’ ఆకాశమే దిగినట్లు
మిషన్ భగీరథ నీళ్లతో మా గొంతు తడార్పిండు..!!
బడిపిల్లల బతుకును దిద్దేందుకు
సర్కారుబళ్లను సక్కంగ దిద్దిండు…!!
పసిపిల్లల బుగ్గల్లో ‘తెల్లని’ నవ్వులు కురిపించిండు..!!
సొంతింటి కల నిజం చేసేందుకు
డబుల్ బెడ్రూం ఇండ్ల కడపలకు
‘పసుపు’ రాసే కాడికి పట్టుకొచ్చిండు….!!
ఆడబిడ్డ లగ్గానికి ఆసరై కల్యాణలక్ష్మి కట్నం బెట్టి
పెండ్లి కూతురు నుదుట ‘ఎరుపు’ తిలకం దిద్దిండు..!!
కొలువుల వరద పారిస్తూ
‘ఇంధ్ర దనుస్సు’ రంగుల వలె మార్శిండు..!!
బతుకమ్మ సీర సింగారించుకున్న రంగుల వలె
మా బతుకుల్లో రంగులు నింపిండు మా కేసీఆర్ సారు..!!
ఇవే మా తెలంగాణలో మాసిపోని రంగుల హోలీ..!!
తుమ్మల కల్పనా రెడ్డి
96404 62142