రేవంత్‌రెడ్డి అధ్యక్షుడయ్యాక టీపీసీసీ టీడీపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా మారిందని ఆ పార్టీ నేతలు గతంలో విమర్శించారు. అనేవాళ్లు ఎలాగూ అంటారని రేవంత్ లైట్ తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఏకంగా గాంధీభవన్‌కు పెట్టిన బోర్డులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎల్లో కలర్ వేశారు. పూర్వాశ్రమంలో రేవంత్ టీడీపీ కావడంతో సింబాలిక్‌గా టీపీసీసీకి ఎల్లో కలర్ వేసినట్టున్నారు. సీనియర్లు ఏమన్నా పట్టించుకోకుండా రేవంత్ హయాంలో మొత్తం మీద కాంగ్రెస్‌కు రంగుపడింది.