‘డబుల్ ఇంజిన్ గ్రోత్’.. బీజేపీ నాయకుల నోట తరచూ వింటున్న రాజ్యాంగ విరుద్ధ సాంకేతిక లోపంతో కూడుకున్న మాట. ఇది భారత రాజ్యాంగంపై అవగాహన ఉన్న ప్రతీ వ్యక్తికి తెలుసు. రాజ్యాంగంలోని ఆర్టికల్-245 నుంచి 255 వరకు కేంద్ర-రాష్ర్టాల మధ్య శాసనపరమైన సంబంధాలను తెలియజే స్తుంది. ఆర్టికల్ 256, 257 పరిపాలనా సంబంధాలను; ఆర్టికల్ 268 నుంచి 293 వరకు కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలను తెలియజేస్తుంది.
ష్ర్టాలకు కేటాయించే, ఇచ్చే నిధులు ఏదో కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేవి కాదు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం వాటాగా దక్కాల్సినవి. Finance Commission Devolution, Finance Commission grants, Centrally Sponsored Schemes రాష్ర్టాలకు రాజ్యాంగం ప్రకారం రావలసినవే. కేంద్రం తన విచక్షణాధికారాలను వినియోగించి కొన్ని రాష్ర్టాలకు అధిక బదలాయింపు ఆర్టికల్ 282 ప్రకారం చేయవచ్చు.
భారత రాజ్యాంగం, దేశాన్ని బహుళ పార్టీ డెమోక్రసీగా నిర్వచించింది. ఆర్టికల్ 327ను అనుసరించి 1951తాత్కాలిక పార్లమెంట్ 1951లో Representation of People Act చట్టం చేసింది. RP act 1951 section 29 (1),(2)ను అనుసరించి దేశంలోని ఎలాంటి సమూహమైనా రాజకీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్లో నమోదు చేసుకోవచ్చు. ఏ పార్టీ అయినా రాజ్యాంగాన్ని అనుసరించి తమ కార్యాచరణ చేపట్టవలసి ఉంటుంది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినప్పటికీ రాజ్యాంగబద్ధంగానే రాజ్యాధికారం చేపట్టవలసి ఉంటుంది. రాజకీయపార్టీలు తాము ఎన్నికల్లో విజయం సాధిస్తే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అమలుచేస్తారో, ఆ ప్రాంత, దేశ ప్రయోజనాలు ఏ విధంగా కాపాడుతారో చెప్పడం ద్వారా ప్రజలను మెప్పించి రాజ్యాధికారం పొందే ప్రయత్నం చేస్తాయి.
దేశంలో అనాది నుంచి అనేక అభిప్రాయాలు ఉండటమే కాకుండా వాటిని అనుసరించే సమూహాలున్నాయి. హిందూ మతంలో అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతాలతో పాటు అనేక పద్ధతులను ఆచరించేవారు ఏ విధంగా అయితే ఉన్నారో, అదేవిధంగా అనేక రాజకీయ భావజాలాలను నమ్మేవారున్నారు. స్వాతంత్య్రానికి ముందే 27 రాజకీయ పార్టీలు 1937 ప్రొవిన్షియల్ ఎన్నికలో పాల్గొన్నాయి. స్వతంత్ర పోరాటంలో కూడా అనేక పార్టీలు వారి వారి పద్ధతుల్లో తమ వంతు కృషిచేశాయి.
1952 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు 53 గుర్తింపు పొందిన రాజకీయపార్టీలు పోటీచేశాయి. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు ‘ఫెడరలిజం’ (సమాఖ్య విధానాన్ని)ను పెంపొందించేలా కృషిచేశాయి. దేశంలో తమ ప్రాంత ప్రయోజనాలు జాతీయపార్టీలు కాపాడలేకపోవడం మూలాన ప్రాంతీయపార్టీలు ఉద్భవించి ఆ ప్రాంత ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాయి.
బీజేపీ ఇప్పుడు ‘డబుల్ ఇంజిన్ గ్రోత్’ అనే పేరిట బీజేపీయేతర పాలిత రాష్ర్టాల్లో అదో బ్రహ్మ పదార్థంగా ప్రజలను మభ్యపెట్టి రాజ్యాధికారం కైవసం చేసుకునే కుట్రకు తెరలేపుతున్నది. ఇలాంటి ప్రచారం వల్ల రాజ్యాంగమే అవహేళనకు గురవుతున్నట్లుగా రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధుల్లో సహకరించుకుంటూ ప్రజల బాగు గురించి ప్రయత్నించడం రాజ్యాంగ బాధ్యత. ఆ బాధ్యతను బీజేపీయేతర పాలిత రాష్ర్టాల్లో అమలు చేయకపోగా ‘డబుల్ ఇంజిన్’ పేరిట రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను విపత్కర పరిస్థితుల్లోకి నెట్టే ప్రయత్నం మోదీ నేతృత్వంలోని బీజేపీ చేస్తున్నది. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో మోదీ-యోగి వల్ల ‘డబుల్ ఇంజిన్ గ్రోత్’ జరిగిందని అబద్ధాలు ప్రచారం చేసినట్లుగా ఆర్థిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 20 16-17లో యూపీలో జీఎస్డీపీ గ్రోత్ రేటు 11.4 శాతం గా ఉంటే యోగి వచ్చాక కరోనాకు ముందే 2019-20కి 3.8 శాతానికి పడిపోయింది. యూపీ ఇండస్ట్రీ జీఎస్డీపీలో 35 శాతంగా 2016-17లో ఉంటే, 2020-21 నాటికి 31 శాతానికి పడిపోయింది. అంటే నిజానికి యూపీ ‘డబుల్ ఇంజిన్’లో నష్టపోయినప్పటికీ లాభపడిందని, అభివృద్ధి చెందినట్లు అసత్య ప్రచారాలు చేసినట్టు, తద్వారా ప్రజలను మభ్యపెట్టినట్లు తేటతెల్లమవుతున్నది.
గత యాభై ఏండ్లలో తమిళనాడులో ఏ జాతీయపార్టీలు అధికారంలోకి రాకపోయినప్పటికీ, అభివృద్ధి చెందిన 3,4 రాష్ర్టాల్లో తమిళనాడు ఒకటిగా నిలుస్తున్నది. తెలంగాణ కూడా గడిచిన 7-8 ఏండ్లలో సీఎం కేసీఆర్ పరిపాలనాదక్షత వల్ల అభివృద్ధి చెందిన, దేశాన్ని సాకుతున్న 3-4 రాష్ర్టా ల్లో ఒకటిగా నిలిచింది.‘గుజరాత్ మోడల్’ అని ప్రచారం చేసుకొని కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. గుజరాత్లో పన్నెండేండ్లు మోదీ ప్రభుత్వం, ఎనిమిదేండ్లుగా డబుల్ ఇంజిన్ ఉన్నప్పటికీ మాతా, శిశు మరణాలు; వ్యవసాయం, సంక్షేమం మొదలగు రంగాల్లో తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. అంటే గుజరాత్ మోడల్ అయినా, డబుల్ ఇంజి న్ అయినా వట్టి డంబాచారమే అని స్పష్టమవుతున్నది.
మోదీ నిజంగా ప్రజా, రైతు సంక్షేమ కాముకుడే అయితే అకస్మాత్తుగా తెలంగాణలో పారా బాయిల్డ్ బియ్యం కొనబోమని చెప్పేవాడు కాదు. క్రమంగా 5-10 ఏండ్లలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి చేయూతనిచ్చి పంటల మార్పునకు సహకరించేవాడు. కానీ రైతు కష్టాలను కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేయ టం వల్ల డబుల్ కాదు సీఎం కేసీఆర్ అన్నట్లు ట్రబుల్ ఇం జిన్. తెలంగాణ రైతుల పక్షాన యాసంగి వడ్లు కొనాలని పోరాడుతున్న కేసీఆర్, టీఆర్ఎస్కు తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో మద్దతు తెలిపి కేంద్రంపై ఒత్తిడి తేవలసిన అవసరాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు.
– పెండ్యాల మంగళాదేవి
మోదీ నిజంగా ప్రజా, రైతు సంక్షేమ కాముకుడే అయితే అకస్మాత్తుగా తెలంగాణలో పారా బాయిల్డ్ బియ్యం కొనబోమని చెప్పేవాడు కాదు. క్రమంగా 5-10 ఏండ్లలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి చేయూతనిచ్చి పంటల మార్పునకు సహకరించేవాడు.
గుజరాత్లో పన్నెండేండ్లు మోదీ ప్రభుత్వం, ఎనిమిదేండ్లుగా డబుల్ ఇంజిన్ ఉన్నప్పటికీ మాతా, శిశు మరణాలు; వ్యవసాయం, సంక్షేమం మొదలగు రంగాల్లో తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. అంటే గుజరాత్ మోడల్ అయినా,డబుల్ ఇంజిన్ అయినా వట్టి డంబాచారమే అని స్పష్టమవుతున్నది.