న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో రెండో సారి సోనియా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి సోనియా బయలుదేరిన సమయంలో ఆమె వెంట రాహుల్, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. జూలై 21వ తేదీన తొలిసారి ఈడీ సోనియా విచారించిన విషయం తెలిసిందే. మరో వైపు ఆ పార్టీలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రపతి భవన్కు ర్యాలీ చేపట్టారు. విపక్ష నేతల్ని బీజేపీ వేధిస్తోందని డీకే శివకుమార్ ఆరోపించారు.