
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 7.48 గంటలకు మణిపూర్‌లోని ఉఖ్రుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఉఖ్రుల్‌కు 56 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.
సోమవారం తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భూమి కంపించింది. ఉదయం 5.28 గంటలకు పోర్టు బ్లేయిర్లో 4.3 తీవ్రతతో భూ ప్రకంపణలు వచ్చాయి. అయితే ఈ భూకంపాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు.