నెన్నెల : క్షయవ్యాధి ( Tuberculosis ) ని సత్వరమే నిర్ధారణ చేసుకుంటే అదే నివారణకు మార్గం అవుతుందని డాక్టర్ లక్ష్మణ్ ( Doctor Laxman ) అన్నారు. మైలారం ఆరోగ్య ఆయుష్మాన్ కేంద్రంలోని గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం క్షయవ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించాలన్నారు.
జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని వెల్లడించారు. క్షయ వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా చికిత్స అందిస్తూ, చికిత్స పూర్తయ్యే వరకు ప్రతినెల రూ.1000 చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి క్షయ తొందరగా వ్యాపిస్తుందని అన్నారు.
పోషకాహారాలు దొరికే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గమమని సూచించారు. తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ఈ వ్యాధి మద్యం సేవించే వారికి పొగాకు నమిలే వారికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. టీబీ సూపర్ వైజర్ శ్రీపెళ్లి శశికాంత్, సూపర్వైజర్ సుశీల, హెల్త్అసిస్టెంట్ రాజ్ కుమార్,ఎంఎల్హెచ్పీ లు శ్రావణి, కావ్య, సంధ్య , ఆర్బీఎస్కే సిబ్బంది ఫార్మాసీ రుక్మిణి , ఏఎన్ఎంలు స్వప్న, గంగా, చంద్రకళ, ఆశలు శైలజ, కిరణ్ కుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.