చండూరు : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపల్ కేంద్రం వాటర్ ట్యాంక్ సెంటర్లో ఆదివారం గాంధీజీ ఫౌండేషన్ ( Gandhiji Foundation ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ( Drinking Water ) చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ( Chairman Srinivasulu ) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్నదని అన్నారు.
నిత్యం పరిసర గ్రామాల నుంచి చండూరు పట్టణానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ప్రతినెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఎన్ని పదవులు అనుభవించినా, ఎంత సంపాదించినా ప్రజలకు సేవ చేయటంలోనే ఆనందం ఉంటుందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి సుష్మా వెంకన్న, బుషిపాక వాసు, కటకం రమేష్, కో ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య సాగర్, ఖలీల్, షరీఫ్ , మొగుదాల వెంకన్న, కారింగు రామ్మూర్తి, పున్న ధర్మేందర్, భీమనపల్లి శేఖర్, ఐతరాజు మల్లేష్, పందుల సత్యం, బోడ వెంకటేశం, గజ్జల కృష్ణారెడ్డి, బ్యాట్ వెంకన్న, సంగెపు శ్రీనివాసులు, సరికొండ వెంకన్న, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు.