BRS Anniversary | ఆస్ట్రేలియాలో ఘనంగా బీఆర్ఎస్ వార్షికోత్సవం
BRS Anniversary | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 26వ వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ( Australia ) అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 26వ వార్షిక దినోత్సవాన్ని (BRS Anniversary) ఘనంగా నిర్వహించారు. మెల్బోర్న్లో విక్టోరియా రాష్ట్ర కన్వీనర్ సాయిరాం ఉప్పు ( Sairam Uppu ) నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ సభ్యులు, తెలంగాణ సంఘాల ప్రతినిధులు , ప్రజలు హాజరయ్యారు.
అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రస్థానాన్ని విశ్లేషించారు. తెలంగాణ సాధన లక్ష్యంతో కేసీఆర్ ప్రారంభించిన ఈ ఉద్యమం శక్తివంతమైన రాజకీయ శక్తిగా మారిందని వివరించారు. సాయిరామ్ ఉప్పు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కొనసాగింపుకోసం బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఎంతో అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వినయ్ సన్నీ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ , కేటీఆర్ అందిస్తున్న నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో ఉదయ్ సింహా రెడ్డి, సూర్య రావు, సునిల్ రెడ్డి, సతీష్ పులిపాక, అశోక్ ఈగ, నితీష్ గౌడ్, వెంకట్, భాస్కర్, విశ్వనాధ్, తెలంగాణ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

