Fuel shortage | ఏపీలో ఇంధన కొరత.. ఆందోళనకు గురి కావద్దని ప్రభుత్వం సూచన
Fuel shortage | ఏపీలో ఇంధన కొరత నానాటికి తీవ్రమవుతుంది. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ( No stock Boards ) దర్శనమివ్వడంతో వాహనాలదారులు భారీ సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు.
అమరావతి : ఏపీలో ఇంధన కొరత ( Fuel shortage) నానాటికి తీవ్రమవుతుంది. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ( No stock Boards ) దర్శనమివ్వడంతో వాహనాలదారులు భారీ సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. విజయవాడ, మార్కాపురం, పల్నాడు, గుంటూరు జిల్లాలో బంకుల వద్దవాహనాలు బారులు తీరాయి.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంధనం కొరతతో బంకుల మూసివేత వాహనాలదారులకు కలవరపాటుకు గురి చేస్తుంది . దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్, తదితరులు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేశారు. ఇంధన కొరతపై సాయంత్రం లోగా నివేదికను అందజేయాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్
ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని మంత్రి నాదెండ్ మనోహర్ ( Minister Manohar ) స్పష్టం చేశారు. సరఫరాలో వచ్చిన చిన్నపాటి లోపాలు వల్లే బంకులు మూతపడుతు న్నాయని, ఇందనానికి ఎలాంటి లోటు లేదని, ఆందోళన అవసరం లేదని వెల్లడించారు. సమాచార, ప్రసార మధ్యమాల్లో ఎప్పటికప్పుడు వివరాలు తెలపాలని చమురు కంపెనీలు, డీలర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు.
పానిక్ సమయంలో డీలర్ల సంఘం ప్రతినిధులు, చమురు కంపెనీలు సమర్ధంగా పనిచేయాలని సూచించారు. కొరత సృష్టించి వినియోగదారులకు అసౌకర్యం కలిగించవద్దని సూచించారు. ఎక్కడా సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలని, చమురు కంపెనీలు డిపోల వద్దకు వెళ్లి జేసీలు తనిఖీ చేపట్టాలని ఆదేశించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

