IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో నిలకడగా రాణిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ పేసర్ లుంగి ఎంగిడి (Lungi Ngidi) అనూహ్యంగా మైదానం వీడాడు. శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ అందుకోబోయి పల్టీ కొట్టిన ఎంగిడి బాధతో విలవిలలాడాడు. పరుగన వచ్చిన ఫిజియో అతడిని పరీక్షించాడు. కానీ, ఎంగిడి ఏమీ స్పందించకపోవడంతో వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఐపీఎల్ చరిత్రలో మైదానంలోకి అంబులెన్స్ వచ్చి, ఒక ఆటగాడిని తీసుకెళ్లడం ఇదే తొలిసారి. దాంతో, ఎంగిడి ఆరోగ్యంపై ఢిల్లీ శిబిరంలో ఆందోళన నెలకొంది.
ఓపెనర్ కేఎల్ రాహుల్(152 నాటౌట్) భారీ శతకం, నితీశ్ రానా(91) అర్ధ శతకంతో పంజాబ్ కింగ్స్‌కు ఢిల్లీ కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. 264 పరుగుల ఛేదనలో దంచేస్తున్న ప్రియాన్స్ ఆర్య.. అక్షర్ పటేలో వేసిన మూడో ఓవర్లో గాల్లోకి లేపిన బంతిని క్యాచ్ అందుకోబోయి ఎంగిడి కింద పడిపోయాడు. వెనక్కి పరుగెడుతూ కింద పడడంతో నేలకు అతడి తల బలంగా తాకింగి. దాంతో, నొప్పితో విలవిలలాడుతూ తల పట్టుకున్నాడు ఎంగిడి. హుటాహుటిన ఫిజియో వచ్చి పరీక్షించినా ఎంగిడి స్పందించలేదు.
Lungi Ngidi got Injured while going for a catch
Looks very serious 😰. Ambulance was called on ground 🚨. pic.twitter.com/GgU9g68Zsw
— Jeet (@JeetN25) April 25, 2026
దాంతో, ఢిల్లీ ఆటగాళ్లు, అభిమానులు అసలు ఏం జరిగింది? అని షాక్‌లో ఉండిపోయారు. మైదానంలోకి అంబులెన్స్‌ను రప్పించారు. స్ట్రెచర్ మీద ఎంగిడిని అందులోకి ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యవసర వైద్యం, స్కానింగ్ పరీక్షల అనంతరం అతడి ఆరోగ్యంపై ఢిల్లీ యాజమాన్యం అప్డేట్ ఇవ్వనుంది. నొప్పితో ఎంగిడి మైదానం వీడడంతో అతడికి సబిస్టిట్యూట్‌గా దుష్యంత్ చమీర వచ్చాడు.
Scary scenes!
Lungi Ngidi has been taken off on a stretcher into an ambulance after his head hit the ground while attempting to take a catch.
Hope everything is okay 🤞#Cricket #DCvPBKS #IPL2026 pic.twitter.com/Z17bl1iK39
— Sportskeeda (@Sportskeeda) April 25, 2026