– సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ
చండూరు, మార్చి 07 : చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో మురుగు కాల్వల నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ కోరారు. శనివారం సిపిఎం ఆధ్వర్యంలో గ్రామంలో సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని 5వ వార్డు, 6వ వార్డు నుండి వచ్చే మురికి నీరు కాల్వల గుండా వచ్చి ఇండ్ల పక్కనే ఖాళీ స్థలంలోకి చేరడంతో ఆ వాసనకు ప్రజలు తట్టుకోలేక రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల తరచుగా సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై పదే పదే ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చెప్పినప్పటికీ రేపు మాపు అని కాలం వెళ్లదీస్తున్నట్లు దుయ్యబట్టారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డ్రైనేజీ కాల్వల నిర్మాణం, మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలని లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి బల్లెం స్వామి, బుర్కల రాజ్ కుమార్, కట్ట రామలింగయ్య, శేఖర్, వెంకన్న, యాదయ్య, కలిమెర భిక్షమయ్య, చెనగోని నరసింహ, సోనగోని నరసింహ, గుయ్యని జంగయ్య, భిక్షం, సాయమ్మ, కర్నాటి సైదమ్మ, కర్నాటి ముత్తమ్మ, బొడ్డుపల్లి భిక్షమయ్య, కట్ట జానమ్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు.