న్యూఢిల్లీ, నవంబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోనున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతోపాటు దేశీయ ఇన్వెస్టర్లు భారీగా నిధులు కుమ్మరించడంతో వచ్చే ఏడాది చివరినాటికి సూచీ సెన్సెక్స్ కీలక మైలురాయిని అధిగమించనున్నదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అంచనావేస్తున్నాయి.
2026 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ లక్ష పాయింట్లు అధిగమించి 1,07,000కి చేరుకోనున్నదని మోర్గాన్‌స్టాన్లీ తాజాగా తన అంచనాను వెల్లడించింది. గడిచిన కొన్నేండ్లుగా సూచీలు గరిష్ఠ స్థాయిలో రిటర్నులు పంచుతున్నదని, ప్రస్తుతం బలమైన దశకు చేరుకున్నదని మోర్గాన్‌స్టాన్లీ..కనిష్ఠంగా 95 వేలు తాకనున్నదని పేర్కొంది.